అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ వాళ్లు పార్టీ జెండాలు కట్టారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని జేసీ నిరసన వ్యక్తం చేశారు.