ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా నిర్మించే లేఔట్‌లో భూమిని ఇవ్వలేకుంటే.. దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక,…
ఇల్లులేని పేదలకోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో సుమారు 15 లక్షలకు పైగా గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులను కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న కాలనీల నిర్మాణం పనులను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన గృహనిర్మాణ పనులను పూర్తిచేస్తామని, రాష్ట్రజనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని ఇస్తున్నామని సీఎం…