రైతు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సీఎం చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం తెలిపిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సీఎంను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ షర్మిల బయదేరారు. మెడలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్‌తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.…
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…