ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇప్పటికే ప్రతీ మంగళవారం.. ఒక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల ఇంటి దగ్గర దీక్షలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ధర్నా చేపట్టారు.. Read Also: Ashwani Kumar Quits Congress: కాంగ్రెస్‌కు మరో…