ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తాంటూ వై.ఎస్ షర్మిళ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో షర్మిల పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆమె మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అని కేసీఅర్ మోసం చేశారని మండిపడ్డారు. తీసుకున్న రుణాలు కట్టలేక ఉన్న పొలాలు అమ్ముకుంటున్నామన్నారు. బ్రతుకు దెరువు లేక ఇంకా బొంబాయి పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. కేసీఅర్ ప్రభుత్వంతో మాకు ఏం మేలు…