YSRCP MLAs Black Scarves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు.