ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలన మీద ధ్యాస లేదని, సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే పూర్తి ధ్యాస పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే కనిపిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు,…
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం…