సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవిని…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి తెర దించేందుకు రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.. సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయనను కలిసినట్టు.. చాలా మంచి వాతావరణంలో సమావేశం జరిగింది.. సమస్యలు అన్నీ సమసిపోతాయనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు చిరంజీవి.. ఇదే సమయంలో.. ఇది ఇద్దరి భేటీయే కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, ఈ భేటీపై తనదైన శైలిలో స్పందించారు సీపీఐ జాతీయ నేత నారాయణ.. చిరంజీవి,…