గత మూడు రోజుల నుంచి నటి కరాటే కళ్యాణి వివాదం రోజురోజుకు ముదురుతోందే కానీ తెగడం లేదు. నిన్నటి నుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్, కిడ్నాప్. పాపతో పారిపోయింది. ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 24 గంటల తరువాత కళ్యాణి మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె ఇంట్లో ఉంటున్న చిన్నారి ఎవరు..? ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానంగా చిన్నారి అసలైన తల్లిదండ్రులను కూడా మీడియా ముందు హాజరుపర్చింది. ఇక ఈ…