యూట్యూబ్‌లో T-సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. T-సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ ఈ ఫీట్ సాధించలేదు. భూషణ్ కుమార్‌కు చెందిన T-సిరీస్ భారతదేశంలోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. T-సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి. Read Also: మరోసారి చిక్కుల్లో విజయ్ సేతుపతి కాగా ఈ…
ప్రస్తుత్రం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చి ఎంతోమందిని చెడగొట్టింది. అది బ్యాన్ చేయడంతో ప్రస్తుతం అందరు యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ అంటూ చెత్త చేత వీడియోలను పెడుతూ లైక్స్ కోసం ఎగబడుతున్నారు. తాజగా ఒక మహిళ యూట్యూబ్ వీడియోల మోజులో పడి జైలుపాలైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.…
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.