Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్‌ఆర్‌పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు…