Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని…