ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు.