సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్సాపీసుకు హరి హర వీరమల్లుతో ఓ ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. ఈ వారం గ్యాప్ లో అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ఫ్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమాపేరు ‘కొత్త పల్లిలో ఒకప్పుడు’. ఇప్పటికే రిలీజైన…