అనకాపల్లి జిల్లా... యలమంచిలి సెగ్మెంట్‌లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్‌లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట.