ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ... క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ... నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మారుస్తూ... కేడర్‌ని రీ ఛార్జ్ మోడ్‌లోకి తీసుకువస్తోంది. అయితే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్‌లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో…