ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు.