విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…