రాజకీయాల్లో గ్రూపులు కామన్. కానీ గ్రూపుల కోసమే రాజకీయాలు నడపడం అనకాపల్లి స్పెషల్. ఇక్కడ వైసీపీలో మూడు ప్రధాన గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎంపీ భీశెట్టి సత్యవతి. మాజీమంత్రి దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా అనకాపల్లి రాజకీయాలతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఇటీవల మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు అమర్నాథ్. ఆ తర్వాత నియోజకవర్గంపై మంత్రి అనుచరుల పట్టు పెరిగింది. గ్రూప్ రాజకీయాల్లో కొత్త హుషారు మొదలైంది.…