(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి) భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ – శశికపూర్, బి.ఆర్.చోప్రా – యశ్ రాజ్ చోప్రా సుప్రసిద్ధులు. అన్న బి.ఆర్.చోప్రా బాటలోనే పయనిస్తూ ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన యశ్ రాజ్ చోప్రా తరువాతి రోజుల్లో దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రొమాంటిక్ మూవీస్ తెరకెక్కించడంలో మేటిగా…