దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. యమునా…
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఇప్పుడిప్పుడే నది ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.62 మీటర్లుగా నమోదైంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకు యమునా నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది.