Yahya Ayyash: యాహ్య అయ్యాష్, హమాస్ ఉగ్రసంస్థలో బాంబు తయారీలో నేర్పరి. అందుకే ఇతడిని అందరూ ముద్దుగా ‘‘ది ఇంజనీర్’’గా పిలుచుకునే వారు. ఇతడికి ప్రత్యేకం పెద్ద అభిమాన వర్గమే ఉండేది. ఇతడు తయారు చేసిన బాంబుల్ని చుట్టుకుని ఆత్మాహుతి దాడుల్లో మరణించడం గౌరవంగా భావించేవారంటే అతిశయోక్తి కాదు.