ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.