Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది.