రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.
రహానేను ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్మెంట్ ధోని అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్ నెస్, ఆటతీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.