ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లోనూ భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. మూడోసారి కూడా ఆ దిశగా దూసుకెళ్లింది. అయితే భారత్‌కు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ చేతిలో ఓడడంతో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపింది. అంతేకాదు ఫైనల్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు 73 గెలుపు శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది.…