ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్ సాధించింది. తన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో నందిని కూడా చేరింది. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కనికా అహుజా,…