వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025కి ముందు మినీ వేలం జరగనుంది. రిటెన్షన్ లిస్టుకు తుది గడువు నవంబర్ 7 కాగా.. ఫ్రాంఛైజీలు గురువారం తాము వదులుకున్న, అట్టిపెట్టుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా వెల్లడించింది. డబ్ల్యూపీఎల్ 2025 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు 24 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. 5 ఫ్రాంఛైజీలు కలిపి 71 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఇందులో 25 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.…