భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని రక్షణ వ్యవస్థ పరీక్షించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కదిలే రైలు నుంచి క్షిపణి ప్రయోగాన్ని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైలు నుంచి అగ్ని-ప్రైమ్ గర్జిస్తోందని పేర్కొన్నారు.