హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వనజ, ఆశా, సీత, విజయ్ అనే నాలుగు ఏనుగులకు సోమవారం ఘనంగా జంబో విందు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా, జూ అధికారులు ఈ నాలుగు ఆసియా ఏనుగులకు విందును అందించారు. పచ్చి సలాడ్, బెల్లం, చెరకుతో కలిపిన పండ్లు , కొబ్బరికాయలతో ప్రత్యేకంగా స్ప్రెడ్ చేయబడింది. భూషణ్ మంజుల నేతృత్వంలోని జూలోని ఫీడ్ స్టోర్ బృందం జంబో విందు ఏర్పాట్లతో ముందుకు వచ్చింది , ఏనుగుల సంరక్షకులు/మహౌట్‌లు,…
World Elephant Day 2024: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణకు కృషి చేస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.
భూమి మీద ఉండే అతి పెద్ద క్షీరదాలు ఏనుగులు. వాటితో మనుషులకు చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచే ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు అంటూ ఆడుకుంటూ ఉంటాం. కేవలం మనుషుల విషయంలోనే కాదు దేవుళ్లకు కూడా ఏనుగులతో మంచి బంధం ఉంది. దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం. మన పురాణాలలో సైతం ఏనుగుల జాతి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రధమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే. అంతటి ప్రాసస్త్యాం…