భారత జీ20 అధ్యక్షత గురించి ప్రశంసలు కురిపించారు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా. భారత్ తన జీ20 ప్రెసిడెన్సీలో ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించిందని, జీ20 డిక్లరేషన్‌ను అన్ని జీ20 దేశాలు ఏకాభిప్రాయంగా ఆమోదించాయని ప్రశంసించారు.
ఇటీవల భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్‌కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు.
ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్‌పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు మాజీ మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను వాషింగ్టన్ నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు.