కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
తమిళనాడులో (Tamilnadu) ఘోర ప్రమాదం జరిగింది. ఊటీలో బిల్డింగ్ కూలి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఊటీలోని జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.