Home
Womens T20 World Cup
Womens T20 World Cup News
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ సోఫీ మోలిన్యూక్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. లార్డ్స్ మైదానంలో వాతావరణం ఫైనల్ మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది. ఎండ తీవ్రత 27 డిగ్రీలుగా ఉండగా, తేలికపాటి గాలి వీస్తోంది. పిచ్‌పై సమానంగా పచ్చటి గడ్డి ఉన్నప్పటికీ, లోపలి భాగం పొడిగా ఉంది. ఇక్కడ ప్రారంభంలో… -
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్స్ చేరడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా, క్లిష్టంగా మారింది. గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి మ్యాచ్ టీమిండియా భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా కూడా భారత్‌కు సెమీస్ అవకాశాలు అంత సులువుగా ఏమీ లేవు. అయితే, సెమీస్‌కు చేరడానికి జట్టు ముందున్న సమీకరణాలు, ఏకైక మార్గం ఇక్కడ చూద్దాం. ఆస్ట్రేలియాపై విజయం.. ప్రస్తుతం భారత జట్టు రన్‌రేట్ (+2.268) చాలా మెరుగ్గా ఉంది. ఒకవేళ భారత్… -
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్‌లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు… -
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఒక కీలకమైన మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగార్ సుల్తానా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది, దాంతో భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది. గ్రూప్-A లో జరుగుతున్న ఈ పోరు ఇరు జట్లకు, ముఖ్యంగా భారత మహిళల జట్టుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.… -
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నీలో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే (భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల చేతిలో) ఓటమి పాలై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో, జట్టు సభ్యులతో పాటు ముఖ్య కోచ్ వహాబ్ రియాజ్‌పై పాక్ క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఇచ్చి 2… -
T20 World Cup: 18 ఏళ్ల కల ముక్కలైంది.. దేశానికి కప్పు అందించలేకపోయానంటూ ఏడ్చేసిన కెప్టెన్..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో శ్రీలంక ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత మైలురాళ్లను అందుకున్నప్పటికీ, కెప్టెన్‌గా జట్టును కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేర్చలేకపోయానని, అందువల్ల ఒక కెప్టెన్‌గా తాను పూర్తిగా విఫలమయ్యానని… -
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సూచించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఐదో స్థానానికి బదులు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని, జెమిమా రోడ్రిగ్స్‌ను ఐదో స్థానంలో దించాలని ఆమె అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని, ఒకవేళ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేదని మిథాలీ… -
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్‌పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
మహిళల టీ-20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నెదర్లాండ్‌పై అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో విరుచుకుపడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు 200 పరుగుల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత ఓపెనర్లు స్మృతి… -
Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన పేలవ ఫామ్‌కు గుడ్‌బై చెప్పిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లకు ముందు తనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె తెలిపింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి భారత్ 170 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ… -
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన దిగ్గజాల సరసన చేరింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు మంధనా వెన్నుముకగా నిలిచింది. ఇన్నింగ్స్ 11.2 ఓవర్ వద్ద…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..