Shocking: దేశ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న బెంగళూరులో నిత్యం లక్షలాది మంది ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న తరుణంలో, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన నగర ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అదే, “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో బోగీల్లో మహిళలు, అమ్మాయిలు ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండా,…
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’ అన్నారో కవి. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం. నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర…
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.
Taliban Official Beating Female Students Outside Afghan University: ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులు ఏ విధంగా ఉంటాయో.. మహిళలను తాలిబాన్లు ఎంత చిన్నచూసు చూస్తారనే దానికి చిన్న ఉదాహరణ ఈ వీడియో. తమ హక్కుల గురించి పోరాడితే అక్కడి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై అణచివేస్తోంది. నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులపై తాలిబాన్ అధికారులు దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజధాని కాబూల్ లో జరిగింది.…