Bengaluru Horror: బెంగళూర్ లో భయానక ఘటన సంభవించింది. రైల్వే స్టేషన్ లో ఓ డ్రమ్ములో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం 1లో చెత్త డ్రమ్ ను శుభ్రపరిచే సమయంలో మృతదేహాన్ని గుర్తించారు. దుర్వాసన రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.