Sandeshkhali: సందేశ్‌ఖలీ లైంగిక వేధింపుల నిందితుడు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 10 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు టీఎంసీ అతడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడిని అరెస్ట్ చేయాలని కొన్ని వారాలుగా సందేశ్‌ఖలీలో మహిళలు, అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి బీజేపీతో సహా పలు విపక్షాలు మద్దతు తెలిపాయి.