ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…