Woman Killed By Brothers: పాకిస్తాన్‌లో మైనారిటీలకే కాదు, అక్కడి మహిళలకు పెద్దగా స్వాతంత్య్రం ఉండదు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా, పెద్దలకు ఎదురు చెప్పినా పరువు హత్యలు అక్కడ చాలా సాధారణం. తాజాగా కరాచీలో ఒక మహిళను సొంత సోదరులే చంపారు. మూడో పెళ్లి చేసుకోవాలనే కోరికను వెలిబుచ్చడంతో మహిళతో ఆమె సోదరులు వాగ్వాదం పెట్టుకున్నారు.