UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని ఓ వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. భార్య 5 నెలల గర్భిణి అని చూడకుండా దాడి చేశాడు. దీంతో ఆమె ఇంటి పైకప్పు నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలోని నాగ్డా ధాక్ గ్రామంలో జరిగింది. బుధవారం సాయంత్రం, మృతురాలు వండి ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉందనే కారణంగా గొడవజరిగింది. ఈ గొడవ కారణంగా బ్రజ్‌బాలా(25) తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు…