Harassment: కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో ఓ మహిళని జిందాల్ గ్రూప్ ఉద్యోగి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని సదరు బాధిత మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక మహిళకు పోర్న్ క్లిప్‌లు చూపించి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.