ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ 2025 ఛాంపియన్‌షిప్ జూన్ 30న ప్రారంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. వింబుల్డన్ కోసం ఇప్పటికే ప్లేయర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈసారి వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. టోర్నీ నగదు బహుమతిని రూ.610 కోట్లు (53.5 మిలియన్స్)గా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వింబుల్డన్ 2024తో పోలిస్తే.. ఈసారి 7 శాతం అధికం. వింబుల్డన్ 2025 విజేతగా నిలిచే ప్లేయర్‌కు రూ.34 కోట్ల…