Earthquake: అలస్కా, కెనడా భూభాగంలోని యుకాన్ సరిహద్దుల్లోని ఒక మారుమూల ప్రాంతంలో శనివారం 7.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. అలాగే ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్థి నష్టం నివేదికలు లేవని అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఈ భూకంపం అలస్కాలోని జూనోకు వాయువ్యంగా సుమారు 230 మైళ్లు (370 కిలోమీటర్లు), యుకాన్‌లోని వైట్‌హార్స్‌కు పశ్చిమాన 155 మైళ్లు (250…