నేడు వర్చువల్ గా జీఆర్ ఎంబీ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కమిటీ చర్చించనుంది. నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి పరామర్శించనున్నారు. నేడు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. మహారాష్ట్రలో నేటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.…