సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంపు కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్ , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని పేర్కొన్నారు.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే…