కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా జనాలు థియేటర్లకు రావడం పెద్దంతగా జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆటలతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య పెరిగింది. గతవారం ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండే సినిమాలు. ఒకటి నాగశౌర్య హీరోగా సితార ఎంటర్…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది.…