సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సరిహద్దుల గుండా పాకిస్థాన్ ఆయుధాలు పంపడాన్ని అంతర్జాతీయంగా ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. డ్రోన్‌లను ఉపయోగించి అక్రమ ఆయుధాల సరఫరాను సీమాంతరంగా సరఫరా చేయడంలో తాము తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నామని భద్రతా మండలికి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేయడాన్ని అమెరికా పరిశీలిస్తోందని, ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుందని, తీవ్రపరిణామాలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు.
Illegal Guns Case: అక్రమ ఆయుధాల కేసులో పురోగతి సాధించారు అనంతపురం పోలీసులు.. ఇప్పటికే ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు.. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో మధ్యప్రదేశ్‌లో దాడులు చేశారు. అక్కడ తొమ్మిది అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 22 తుపాకీలు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. సంఘవిద్రోహుల చేతుల్లోకి అక్రమ ఆయుధాలు వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను…
మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్లు, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయడం లేదా కంటెంట్‌ను ప్రసారం చేయకుండా ఎఫ్ఎం రేడియో ఛానెళ్లను కేంద్రం హెచ్చరించింది.
మన పొరుగుదేశం చైనా దూకుడు పెంచింది. సంప్రదాయక సైనిక శక్తిని తగ్గించుకుంటూ వచ్చినచైనా ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలపై దృష్టిసారించింది. క్షిపణులు, రాకెట్లపై దృష్టి సారించింది. అణ్వాయుథాలు మోసుకెళ్లే శక్తి గత బలమైన క్షిపణులపై చేనా ప్రయోగాలు చేస్తున్నది. భారత్ సరిహద్దుల్లో నిత్యం రగడ సృష్టిస్తున్న చైనా అటు తైవాన్ ను ఆక్రమించుకోవడానికి పథకాలు రచిస్తోంది. తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించి భూమిపై తాము ఎక్కడైనా దాడులు చేయగలమని…
లద్దాఖ్‌లోని గల్వాన్ ఘటన తరువాత భారత ప్రభుత్వం సైనికుల కోసం అధునాతనమైన ఆయుధాలను సమకూర్చడం మొదలు పెట్టింది. ఇండియా చైనా బోర్డర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో పహరా నిర్వహించకూడదు అనే ఒప్పందం ఉన్నది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాలతో గల్వాన్‌లో భారత్ సైనికులపై దాడి చేసింది. అయితే, ఆ దాడిని భారత సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఆ దాడిలో భారత్ 20 మంది సైనికులను కోల్పోగా, చైనా…
వివాదాస్పద నిర్ణయాలు, ఎవరైతే నాకేంటి అంటూ ఇచ్చే ప్రకటనలు, వివాదాస్పద చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఉత్తర కొరియా నియంత కిమ్… తాజాగా, కొత్త తరహా హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది ఉత్తర కొరియా. హాసంగ్-8గా ఆ మిస్సైల్‌ను పిలుస్తున్నారు. అయిదేళ్ల సైనిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అయిదు కొత్త ఆయుధాలను తయారు చేశామని, దాంట్లో ఈ మిస్సైల్ కూడా ఒకటని నార్త్ కొరియా తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఆయుధమని ఆ దేశం చెబుతోంది. ఉత్తర కొరియా ఇచ్చిన…
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 15 ముందు వరకు ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఆగస్టు 19 వ తేదీ ఆఫ్ఘన్‌కు స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజుకు ముందే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 లోగా అమెరికా బలగాలు ఉపసంహరించుకోవాలని ఇప్పటికే తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఇదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్‌పై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లకు అప్పగిస్తే అక్కడ తిరిగి స్థానిక…
ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం…