క్రికెట్ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో తాను బరిలో దిగనున్నట్లు ఏబీడీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు డబ్ల్యూసీఎల్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. డబ్ల్యూసీఎల్ రెండవ ఎడిషన్‌లో గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు ఏబీడీ నాయకత్వం వహిస్తాడు. తాను మైదానంలోకి బరిలోకి దిగుతున్నట్లు మిస్టర్ 360 ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా…