గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో ఏపీలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో వుంది. రిజర్వాయర్ కి సంబంధించిన ఆరు గేట్లును ఎత్తి 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం పూర్తి నీటి మట్టం 78 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటిమట్టం 76.639 టీఎంసీలకు చేరుకుంది. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా వుండగా…
చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు…
ఎగువన కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 27,524 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 25,427 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 823.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 43.5460 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి…