తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్‌ఎస్. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు... తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా... ఈ మధ్య కాలంలో ఆ…
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి.. చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో…
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి…
KCR: బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలిపారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన కేసీఆర్.. ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సభ విజయవంతం కావడానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. రేపు మధ్యాహ్నం 1…