వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరుతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకి రణనినాదం చేసింది తెలంగాణ కాంగ్రెస్. 2023లో రాబోయే ఎన్నికలకు నాందిగా సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. బ్రిటీషు బానిస సంకెళ్ల విముక్తి నుండి స్వాతంత్ర్య భారత నిర్మాణానికి పునాది రాయి వేసే వరకు… భిన్నత్వంలో ఏకత్వంగా జాతిని ఐక్యం చేయడం నుండి నవ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక భారతావని నిర్మాణం వరకు… ఈ దేశ గమనంలో, గమ్యంలో కాంగ్రెస్…